భారతమా! మళ్ళీ నిలబడు

ఆ కాలపు సంకెళ్ళు పడలేదని బాధ పడకు
ఈ కాలపు చీకటిని చీల్చుకొని ఒక శక్తిలా వికసించు
భావి భారతపు ఎదురు చూపులే దిక్సూచిగా
నవ్య ధరణి స్కంధమే ఇంధనముగా
సాంకేతిక మేధో మథనమే శ్వాసగా
శూన్య ప్రతిఫలాపేక్షనే ఆశగా ముందుకు సాగిపో

నువ్వు కావాలి ఒక ఉదాహరణ
తర్వాత రాబోయేది ఒక ఉప్పెన
బిగించు నీ పిడికిలిని
ఒడిసి పట్టుకో ఈ అవకాశాన్ని

రాజ్యాన్నేలే బాధ్యత మరచి
బ్రతికే దార్లుగా మార్చే దుస్థితి
రానీయకు వీటిని నీ పయనంలో
కదలిపో, మిత్రమా! ముందుకు కదలిపో

Comments (2)

Older Posts »